బీజేడీ చీఫ్‌గా నవీన్‌ పట్నాయక్‌ ఎనిమిదోసారి

 ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ మరోసారి బీజూ జనతాదళ్‌(బీజేడీ) అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్ష ఎన్నికకు నవీన్‌ పట్నాయక్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో పట్నాయక్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం ఇది ఎనిమిదోసారి. గ్రామ పంచాయతీ కమిటీ సభ్యుల నుంచి రాష్ట్రస్థాయి అధ్యక్షుల వరకు బీజేడీ సంస్థాగత ఎన్నికలు మొత్తం ఐదు దశల్లో కొనసాగాయి. ఫిబ్రవరి 21వ తేదీన పార్టీ 33 జిల్లాల అధ్యక్షులను ప్రకటించింది. వీరిలో 14 మంది పాతవారే తిరిగి జిల్లా అధ్యక్షులుగా ఎన్నికవ్వగా.. కొత్తగా 19 మంది జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.