ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యాహ్నం వరకు కోవిడ్-19 కేసులు కొత్తవి నమోదు కాలేదు. గడిచిన రాత్రి నుంచి రాష్ట్రంలో కొత్తగా కోవిడ్-19 కేసులు నమోదు కాలేదని రాష్ట్ర నోడల్ అధికారి అజ్రా శ్రీకాంత్ తెలిపారు. నిన్న రాత్రి 6 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు 217 శాంపిల్స్‌ను పరీక్షంచినట్లు తెలిపారు. అన్ని శాంపిల్స్‌లలో ఒక్క కేసు కూడా పాజిటివ్‌గా తేలలేదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 348 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు శ్రీకాంత్ తెలిపారు.
ఏపీలో కొత్తగా ఒక్క కేసు నమోదు కాలేదు